నారా లోకేశ్ ప్రచారానికి వెళుతున్న టీడీపీ నేత వాహనంపై రాళ్ల దాడి

  • చినకాకినిలో లోకేశ్ ప్రచారం
  • హరిబాబు కారులో వస్తుండగా దాడి
  • దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసులు
మంత్రి నారా లోకేశ్ ప్రచారానికి వెళుతున్న టీడీపీ నేత వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో కారు వెనుక భాగంలోని అద్దాలు పగిలిపోయాయి. లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్ నేడు మంగళగిరి మండలం చినకాకానిలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి హాజరయ్యేందుకు టీడీపీ నేత పోలవరపు హరిబాబు కారులో వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Haribabu
Mangalagiri
Telugudesam
Police

More Telugu News